విజయనగరం జిల్లా ఎన్నికల నిర్వహణలో రిటర్నింగు అధికారులదే కీలక పాత్ర అని కలెక్టర్ హరిజవహర్‌లాల్ అన్నారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శుక్రవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్వతీపురం డివిజన్‌లోని రిటర్నింగ్, సహాయ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. మద్యం, డబ్బు ప్రభావం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణకు హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటీడీఏ పీవో కూర్మనాథ్, సబ్‌కలెక్టరు విధేఖరే, డీపీవో సునీల్‌రాజ్‌కుమార్, జిల్లా సహకార అధికారి అప్పలనాయుడు, ముఖ్య ప్రణాళికాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.
సాధారణ ఎన్నికల కంటే ఇవి చాలా సున్నితమైనవి. అందువల్ల ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు తప్ప వ్యక్తిగత ప్రాధామ్యాలు ఉండ కూడదు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణలో కచ్చితంగా సమయపాలన పాటించాలి. ఎక్కడ నచ్చితే అక్కడ స్వీకరణ తగదు. నిర్దేశిత కార్యాలయంలోనే స్వీకరించి, అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. జిల్లాలో గత ఎన్నికల్లో రెండు వేల సమస్యాత్మక గ్రామాలు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య పెరిగే అవకాశముంది. సమస్యాత్మక, సున్నిత, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిని పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు సంయుక్తంగా గుర్తిస్తున్నాయి.-హరిజవహర్‌లాల్ , జిల్లా కలెక్టర్
ఇదీ చదవండి: