వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు స్పష్టం చేశారు. విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీసులతో సమావేశమైన ఆయన... మూడు నెలల పాటు జిల్లాను కరోనా గ్రీన్‌జోన్‌గా ఉంచడంలో సఫలీకృతమయ్యారని ప్రశంసించారు.
జిల్లాలో దాదాపు 660 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని... కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే వైరస్ సోకిందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని పోలీసులకు సూచించారు. కొవిడ్ కారణంగా మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
స్థిరంగా కొనసాగుతున్న ద్రోణి... వచ్చే 2 రోజులు విస్తారంగా వర్షాలు