విజయనగరం పోలీసు పరేడ్ మైదానంలో విశాఖ రేంజ్ పోలీసు డ్యూటీ మీట్‌కు.. విజయనగరం జిల్లా న్యాయమూర్తి జస్టిస్ గోపి, డీఐజీ రంగారావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో.. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
నిందితులను శిక్షించేందుకు.. దర్యాప్తులో భౌతికసాక్ష్యాలను సేకరించడం చాలా ముఖ్యమని న్యాయమూర్తి జస్టిస్ గోపి సూచించారు. పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని.. ప్రతిభ కనబర్చాలన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే.. ఏ వృత్తిలోనైనా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఎంతో ఉపయోగపడుతుందని.. విశాఖపట్నం డీఐజీ రంగారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి వెళ్లే ముందు, జిల్లా, రేంజ్ స్థాయిల్లో డ్యూటీమీట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి: