ETV Bharat / state

అధికారులతో కుదరక.. చందాలతో రోడ్డు నిర్మించుకుంటున్నారు!

రోడ్డు కోసం వినతులిచ్చారు. ఎవరైనా స్పందిస్తారని ఆశపడ్డారు. నిర్మాణం కోసం ఎదురుచూశారు. ఎవరూ ముందుకు రాకపోయేసరికి.. విసిగిపోయిన విజయనగరం జిల్లా గిరిజనులు.. స్వయంకృషితో రోడ్డు నిర్మాణానికి నడుం బిగించారు. బట్టివలస నుంచి రూఢి వరకు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

vijyanagaram district tribals laid road
vijyanagaram district tribals laid road
author img

By

Published : Nov 24, 2020, 1:17 PM IST

చందాలతో రోడ్డు నిర్మిస్తున్న గిరిజనులు

విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలోని గిరిజనులు.. రోడ్డు సౌకర్యం కోసం శ్రమదానానికి ముందుకొచ్చారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. వారు స్పందించని పరిస్థితుల్లో.. గ్రామస్తులే రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజుల కిందట బట్టి వలస నుంచి రూడి గ్రామం వరకు రోడ్డు నిర్మాణం ప్రారంభించారు.

రోడ్డు పనులు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. బట్టి వలస, పుల్ల మామిడి, కాగూ రూడి, గాలి పాడు, రామ్ పాడు, సలపర బంధ, మర్రివలస, ఎగువ రూడి, దిగు వ రూడి గ్రామస్తులు అందరూ గిరిజనులు కలిసి చందాలు పోగు చేసుకుని రోడ్డు నిర్మిస్తున్నారు. ఇంటికి రెండు వేల రూపాయల చొప్పున నిధులు సమకూర్చుకున్నారు. శ్రమ దానం చేస్తూ అవసరమైనప్పుడు యంత్రాన్ని వినియోగిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఏపీలో తాగునీటిపై పన్నుల మోత.. వచ్చే ఏప్రిల్‌ నుంచి పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.