ETV Bharat / state

'ఫుడ్ బ్యాంక్'ను ప్రారంభించిన విజయనగరం యూత్ ఫౌండేషన్

నేటికీ ఓ పూట ఆహారం కోసం అలమటించేవారు ఎందరో.. ఉన్నారు. కరోనా కారణంగా పనులు దొరక్క.. పూట గడవని స్థితి నెలకొంది. మరో వైపు ఇంటో మిగిలిన ఆహారాన్ని పరులకు అందిదామన్నా వారికి ఎలా, ఎక్కడ ఇవ్వాలో అర్థం కావట్లేదు అంటున్నారు కొందరు దాతలు. అటు దాతలకు.. ఇటు అన్నార్తులకు మధ్య వారధిగా నిలిచారు విజయనగరం యూత్ ఫౌండేషన్. 'ఫుడ్ బ్యాంక్' పేరుతో వీరు చేసిన ఓ వినూత్న ప్రయత్నం పలువురి ప్రశంసలు పొందుతోంది.

ఫుడ్ బ్యాంక్
FOOD BANK
author img

By

Published : Jul 30, 2021, 7:19 PM IST

ఒక్క పూట అన్నం కోసం అలమటించే వారి కోసం విజయనగరం యూత్ ఫౌండేషన్ ఓ అడుగు ముందుకేసింది. అవకాశం ఉన్న వారు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించేందుకు వీలుగా 'ఫుడ్ బ్యాంక్' ను ఏర్పాటు చేశారు. అందుకోసం విజయనగరం మయూరి కూడలి వద్ద ఒక పెద్ద ప్రత్యేక ఫ్రిజ్​ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ ఫుడ్ బ్యాంక్​ను శుక్రవారం ఏటికే-వెలుగు వృద్ధాశ్రమం అధ్యక్షుడు, నిత్యాన్నదాన దర్బార్ నిర్వాహకులు డాక్టర్ ఎండీ ఖలీల్ బాబు ప్రారంభించారు. సుమారు 200 మందికి మధ్యాహ్న ఆహారాన్ని ఆయన చేతుల మీదుగా అందచేశారు.

విజయనగరం యూత్ ఫౌండేషన్ యువకులు చేస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని ఖలీల్ బాబు ప్రశంసించారు. బ్లడ్ బ్యాంక్, ట్రీ బ్యాంక్, ల్యాండ్ బ్యాంక్ మాదిరి ఫుడ్ బ్యాంకు అనేది వినూత్న కాన్సెప్ట్ అని అభివర్ణించారు. కొవిడ్ వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోయాయని, ఒక్క పూట అన్నం కోసం అలమటించే అభాగ్యులు.. ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టే చోట దేవుడు నెలవై ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా విపత్తులో మృతులకి అంతిమ సంస్కరాలతో పాటు ఆర్థిక, వ్యయ ప్రయాసలకి ఓర్చి అంబులెన్స్ సేవలు అందించిన ఇల్తమస్, అంబులెన్స్ శివలను ప్రత్యేకంగా అభినందించారు.

మయూరి కూడలి తొలి ఫుడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేశామని యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఇల్తమస్ తెలిపారు. నిత్యం రోడ్లమీద ఎందరో అభాగ్యులు ఒక్కపూట అన్నం కోసం.. అందించే చేతుల కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారని అన్నారు. అలాగే దయార్ద్ర హృదయులకి సహాయం చేయాలని ఉన్నా, ఎక్కడ ఎలా ఎవరికి సహాయం చేయాలో తెలియక తమ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారని తెలిపారు. అటు అన్నార్తులకి, ఇటు దాతృత్వం కలిగిన దాతలకి మధ్య వారధిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఫుడ్ బ్యాంకులో ఎవరైనా తమ వద్ద మిగిలిన ఆహారాన్ని ప్యాకింగ్ రూపంలో పెట్టవచ్చును. అలాగే ఎవరికైనా ఆహారం కావాలంటే ఈ ఫుడ్ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చునని తెలిపారు.

ఇదీ చదవండీ.. రోడ్డపైకి వస్తున్న వన్యప్రాణులు.. ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.