ETV Bharat / state

భోగాపురం విమానాశ్రయం రహదారి పనులను సమీక్షించిన జేఏసీ

author img

By

Published : Jul 21, 2020, 11:29 PM IST

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన రహదారి పనులను జేఏసీ కిషోర్​ బాబు పర్యవేక్షించారు. టెర్మినల్​ పాయింట్​కు అనుసంధానం జరిగే రహదారి నిర్మాణంపై సమీక్ష జరిపారు.

vijayanagaram joint collector visits bhogapuram airport terminal
రహదారి నిర్మాణంపై సమీక్ష జరిపిన విజయనగరం జేఏసీ

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన రహదారి పనులను జాయింట్​ కలెక్టర్​ కిషోర్​ బాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జేఏసీతో పాటు ఎయిర్​పోర్ట్​ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ హైవే, రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. భోగాపురం మండలం ఉప్పాడ పేట జాతీయ రహదారి నుంచి టెర్మినల్ పాయింట్​కు అనుసంధానం జరిగే రహదారి నిర్మాణంపై సమీక్ష జరిపారు. జాతీయ రహదారి నుంచి 3.1 కిలోమీటర్ల దూరంలో ఉండే టెర్మినల్​కు వెళ్లే వాహనాల రాకపోకలకు అనుకూలంగా వంతెన నిర్మాణం జరుగుతున్న విషయంలో అధికారులు మరింత శ్రద్ధ వహించాలన్నారు.

ఇటు శ్రీకాకుళం అటు విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యార్థంగా వృత్తాకారంలో వంతెన నిర్మాణం జరగాలని కిషోర్​ కుమార్​ తెలియజేశారు. దీనివలన ఇరు ప్రాంతాల వారికి ఎంతో వీలుగా ఉంటుందన్నారు. నాలుగైదు రోజుల్లో వంతెన నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయిలో మ్యాప్ డిజైన్ సిద్ధం చేస్తామని హైవే అథారిటీ డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్ మిశ్రా జేఏసీకి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :

'త్వరలోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు మొదలుపెడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.