విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు.. అంధ జంటకు మానవత్వంతో సాయం చేశారు. కర్ఫ్యూ సమయంలో వాహనాల్లేక ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలిచారు.
పార్వతీపురం లెప్రసీ కాలనీలో నివాసం ఉంటున్న అంధ దంపతులను.. పోలీసు వాహనంలో తీసుకెళ్లి ఇంటివద్ద విడిచిపెట్టారు. తమకు సాయం చేసిన పార్వతీపురం డీఎస్పీ సుభాష్, సీఐ లక్ష్మణరావు, ఇతర సిబ్బందికి ఆ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో.. మరో జాయింట్ కలెక్టర్ పోస్టు!