ETV Bharat / state

ఉచిత రేషన్ పంపిణీలో విజయనగరం టాప్ - విజయనగరం జిల్లా ఉచిత రేషన్ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాగం కృషివల్లే సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయగలిగామని జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్​ లాల్ తెలిపారు.

Vijayanagaram District is the first in the distribution of free ration rice in ap state

author img

By

Published : Jun 3, 2020, 12:39 PM IST

విజయనగరం జిల్లా... పేదలకు ఉచిత రేషన్ పంపిణీలో ముందంజలో ఉంది. కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ప్రకటించిన ఉచిత రేషన్ ఐదో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా మే 29 నుంచి జూన్ 2 వరకూ అందజేశారు.

జిల్లాలో 7.10 లక్షల కార్డులపై ఉచిత రేషన్ సరఫరా చేయాల్సి ఉండగా... జూన్ 2వ తేదీ నాటికి 5.48 లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ పూర్తిచేశామని కలెక్టర్ ఎం.హరిజవహర్​ లాల్ తెలిపారు. 77 శాతం కార్డుదారులకు రేషన్ పంపిణీ పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల ప్రయోజనాలను సంబంధిత వర్గాలకు అందించడంలో... జిల్లా అధికారులు, ఉద్యోగులు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలోనూ జిల్లా ప్రథమ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: విద్యాశాఖలో 'నాడు-నేడు' అమలుపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.