ETV Bharat / state

రైతులకు అందుబాటులోకి ఇంద్రావతి

తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే చోడి వంగడాన్ని విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది.

Vijayanagaram Agricultural Research Station has developed finger millet varities
రైతులకు అందుబాటులోకి ఇంద్రావతి
author img

By

Published : May 29, 2020, 7:46 AM IST

తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడిని అందించే చోడి(రాగులు) వంగడం వీఆర్‌1101(ఇంద్రావతి)ను విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఖరీఫ్‌, రబీ సీజన్లలో విత్తుకోవచ్చని, పంట కాలపరిమితి 115 రోజులని, హెక్టారుకు 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వేసుకొనేందుకు అనుకూలమన్నారు.

గురువారం దిల్లీ నుంచి జూమ్‌ డిజిటల్‌ ద్వారా నిర్వహించిన చిరుధాన్యాల జాతీయ సదస్సులో ఐకార్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ త్రిలోచన మహాపాత్రో ఈ నూతన వంగడాన్ని విడుదల చేశారు.

* పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు టి.ఎస్‌.ఎస్‌.కె.పాత్రో, ఎన్‌.అనురాధ, వై.సంధ్యారాణి, యు.త్రివేణి, ఎం.ఎం.వి.శ్రీనివాసరావు.. చిరుధాన్యాల్లో సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల్లో గిరిజన ఉప ప్రణాళిక, చిరుధాన్యాల్లో ఆశించే తెగుళ్లు, పురుగులు నివారణ చర్యలపై రాసిన పుస్తకాలను మహాపాత్రో ఆవిష్కరించారు.

* 2017-2020 సంవత్సరాలకు సంబంధించి వివిధ అంశాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ చిరుధాన్యాల పరిశోధనా కేంద్రంగా విజయనగరానికి పురస్కారం దక్కింది.

ఇవీ చదవండి:విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.