విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అయ్యప్ప అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో.. 100 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై నీలకంఠం సమక్షంలో ఇంటింటికీ వెళ్లి సరకులు అందజేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో వీటిని అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి.. కర్నూలులో మాంసాహార దుకాణాలు బంద్