ETV Bharat / state

సంచయిత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు: ఊర్మిళ గజపతిరాజు

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత, ఊర్మిళ గజపతిరాజు మధ్య వివాదం ముదురుతోంది. విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవంలో తమను అవమానించటంపై తాజాగా ఊర్మిళ స్పందించారు. సంచయిత వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని అన్నారు.

urmila gajapathi raju
ఊర్మిళ గజపతిరాజు
author img

By

Published : Oct 29, 2020, 1:27 PM IST

ఏటా జరిగే పైడితల్లి అమ్మవారి పండుగలో పాల్గొనడం తమ కుటుంబ సంప్రదాయమని.. ఉత్సవం చూసేందుకు తమకు ఎవరి అనుమతి అవసరం లేదని ఊర్మిళ గజపతిరాజు అన్నారు. సిరిమానోత్సవంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత తమను అవమానించడంపై ఘాటుగా స్పందించారు.

'ఏటా మాదిరిగానే ఈ ఏడాది మా అమ్మతో కలిసి సిరిమానోత్సవం వీక్షించేందుకు వచ్చాను. మమ్మల్ని కోటలో చూసిన సంచయిత అవమానకరంగా మాట్లాడారు. పోలీసులు, ట్రస్ట్ అధికారులు మాపై మండిపడ్డారు. ముందు వరుసలో ఉన్న మమ్మల్ని వెనక్కు వెళ్లాలని మాన్సస్ ఈవో చెప్పారు. ఆయనను బతిమాలి కాసేపు కూర్చుని దర్శనం చేసుకుని వెళ్లాం. సంచయిత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. మా తాత, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా చేయలేదు. మాన్సస్ ట్రస్టును సంచయిత తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తున్నారు' అని ఊర్మిళ గజపతిరాజు అన్నారు.

ఇవీ చదవండి..

సంచైత, ఊర్మిళ గజపతిరాజు కుటుంబాల మధ్య కొత్త వివాదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.