ETV Bharat / state

రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చిన పిడుగు

వాలీబాల్ ఆడుతున్న వారిపై పిడుగు పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిలో ఒకరికి 6 నెలల క్రితమే వివాహం కాగా... అతని భార్య ప్రస్తుతం 3 నెలల గర్భిణి.

author img

By

Published : Apr 1, 2019, 6:30 AM IST

మెరుపులతో కూడిన మేఘం
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కరకవలసలో విషాదం చోటు చేసుకుంది. వాలీబాల్ ఆడుతున్న సమయంలో పిడుగు పాటుకు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామానికి చెందిన ప్రేమకుమార్, వెలగాడ శివ... స్నేహితులతో కలిసి సాయంత్రం వాలీబాల్ ఆడుతుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా... మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని వెంటనే విజయనగరం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరైన ప్రేమకుమార్​కు ఆరు నెలల క్రితమే వివాహం జరగ్గా... అతని భార్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ. మరో మృతుడైన శివ...వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. ఇటీవలే అతని తండ్రి మరణించారు. వాలీబాల్ ఆడుతున్న యువకులను పిడుగు కబళించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Intro:AP_ONG_11_01_TDP_YAADAVA_SADASSU_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...................................................................................
తెదేపా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు లో జరిగిన యాదవ ఆత్మీయ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు మంత్రి శిద్దా రాఘవరావు, దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని యాదవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవులు మంత్రి శిద్దా, ఎమ్మెల్యే దామచర్లని ఘనంగా సన్మానించారు. ఇరువురు నియోజకవర్గ పరిధిలోని పలువురు యాదవులకు జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల మాట్లాడుతూ.... యాదవులు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేసమని అన్నారు. రానున్న రోజుల్లో యాదవులకు జిల్లా నుంచి శాసనమండలిలో ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.అనంతరం మంత్రి శిద్దా...ఎన్నికల్లో తెదేపాకి ఓటు వేసి తమకు ఘన విజయం అందించాలని కోరారు....బైట్స్
1.దామచర్ల జనార్దన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు
2. శిద్దా రాఘవరావు, ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి.

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.