విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కొంకిడవరం గ్రామంలో.. ఇంటి గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కూలీలు ఓలేటి పోలినాయుడు, సత్యనారాయణ ఇంటి పునాదుల పనులు చేస్తున్నారు. పక్కనే ఉన్న పెంకుటిల్లు గోడ ఒక్కసారిగా కూలడంతో.. వారిద్దరు శిథిలాల మధ్య చిక్కుకుని మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలవ్వటంతో పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు.
శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని స్థానికులు బయటకు తీశారు. తహసీల్దార్ వీవీఎస్. శర్మ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.
ఇదీ చదవండి: