విజయనగరం జిల్లా సాలూరు పరిధిలోని గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికై చలో సాలూరు కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన గిరిజనులు పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్నదొరకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గిరిజన గ్రామాలన్నింటిని 5వ షెడ్యూల్ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. షెడ్యూల్ ధ్రువీకరణ పత్రాలిచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ, బంజరు భూములు సర్వే చేపట్టి పట్టాలివ్వాలన్నారు.
డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాజన్నదొర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీచదవండి