విజయనగరం జిల్లా పార్వతీపురంలో వ్యవసాయ శాఖ సిబ్బందికి డిజిటల్ కియోస్క్ యంత్ర వినియోగంపై.. అధికారులు శిక్షణ ఇస్తున్నారు. మార్కెట్ యార్డు వద్ద రైతు భరోసా కేంద్రంలో జరుగుతున్న ఈ శిక్షణ తీరును ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరిశీలించారు. యంత్రం పనితీరు, ప్రయోజనాలను నిపుణులు వివరించారు.
సచివాలయాల్లో ఉన్న గ్రామీణ వ్యవసాయ సహాయకులకు ఈ యంత్రం పై అవగాహన కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. గ్రామ పరిధిలో అన్ని పంటలను ఈ-పాస్ విధానంలో నమోదుచేసి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
రైతులు సచివాలయానికి వచ్చి తమకు అవసరమైన విత్తనాలు పొందేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి అంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఆధునిక యంత్రంలో వివరాలు నమోదును నిపుణులు ఎమ్మెల్యేకి వివరించారు.
ఇదీ చూడండి: