ETV Bharat / state

అత్యవసరం ఉంది.. దయచేసి అనుమతించండి! - too much requests from citizens

"మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు. మెరుగైన వైద్యం అందించేందుకు విశాఖ తీసుకెళ్లాలి. మా నాన్న గారు అనారోగ్యంతో చనిపోయారు.. చివరి చూపునకు అవకాశం కల్పించండి." అంటూ.. గత 15 రోజుల్లో.. 6 వేలకు పైగా వినతులు జిల్లాలో పోలీసులకు అందాయి.

vizianagaram
వాట్సాప్‌లో దరఖాస్తుల వెల్లువ
author img

By

Published : Apr 29, 2020, 5:10 PM IST

విజయనగరం జిల్లాలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న వారినుంచి రాకపోకల నిమిత్తం అనుమతించాలంటూ.. పోలీసులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల పోలీసులు సూచించగా.. గత 15 రోజుల్లో 6వేలకు పైగా వినతులు వెల్లువెత్తాయి. వాటిల్లో అత్యవసరమైనవాటిని 1113 గా గుర్తించి అనుమతించినట్లు డీఎస్పీ మోహన్‌రావు చెప్పారు.

అనుమతులిలా..

వైద్యం - 840

ప్రభుత్వ పాస్‌లు - 60

ఇతరత్రా అనుమతులు - 135

మరణాలు - 78

దరఖాస్తు ఇలా..

జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నంబరు 630 98 98 989 కు పేరు, ఊరు, చరవాణి నంబరు, సమస్య ఏమిటి..?, వాహనం, ఆధార్‌ కార్డు నంబర్లు టైప్‌ చేసి పంపించాలి. 24 గంటల్లో అనుమతిచ్చేలా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఏర్పాట్లు చేస్తారు. ఏ నంబరు నుంచి విన్నపం వస్తుందో అదే నంబరుకు అనుమతిస్తూ పాస్‌ మంజూరు చేసినట్లు ఒక పత్రం పంపిస్తారు. పాస్‌ పొందిన వారు మాత్రమే వెళ్లడానికి అర్హులు. కేవలం రాష్ట్ర పరిధిలో విన్నపాలను మాత్రమే పరిశీలిస్తున్నారు. ఇందులోనూ మరణాలకు, వైద్యానికి సంబంధించినవే అధికంగా ఉన్నాయి.

"మా కార్యాలయానికి రావొద్దు"

అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేందుకు చేసుకున్న విన్నపాలను పరిశీలించామని ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. అర్హులైన వారికి పాస్‌లు మంజూరు చేశామని అన్నారు. ఎవరూ కార్యాలయానికి రావాల్సిన పని లేదని పేర్కొన్నారు. వారు పంపించిన చరవాణికే సమాధానం వస్తుందని చెప్పారు. కరోనా రహిత జిల్లాగా విజయనగరాన్ని చూడాలనే నిబంధనలను కఠినం చేశామని బి.రాజకుమారి తెలిపారు.

ఇదీ చదవండి:

బొబ్బిలి - పార్వతీపురం మధ్య రాకపోకలు బంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.