విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడతున్నాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
- పూసపాటిరేగ మండలం నడిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లంకలపల్లి గాయత్రి 5 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.
- పూసపాటిరేగ మండలం లంకలపల్లి పాలెం సర్పంచ్ అభ్యర్థిగా రౌతు వెంకటరత్నం 4 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.