ETV Bharat / state

నిరసనలతో మార్మోగిన పార్వతీపురం - గిద్దలూరు

తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ... వివిధ సంఘాలు పార్వతీపురంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

నిరసనలతో మార్మోగిన పార్వతీపురం
author img

By

Published : Jul 15, 2019, 6:01 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణం నిరసన కార్యక్రమాలతో హోరెత్తింది. సమస్యలకు పరిష్కారం చూపాలని వివిధ సంఘాలు ధర్నాలు చేపట్టాయి. ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించలేని కారణంగా...ప్రకాశం జిల్లా గిద్దలూరు రక్తం నిల్వ కేంద్రంలో పనిచేస్తున్న టెక్నీషియన్ నాగేశ్వర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు నిరసనగా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి రక్తనిధి కేంద్ర సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి...పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు.

నిరసనలతో మార్మోగిన పార్వతీపురం
వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆసుపత్రి ముందు నిరసన తెలియజేశారు. మంగళవారం నుంచి సమ్మె చేయనున్నట్లు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఆర్.వి.ఎస్. కుమార్ తెలిపారు. ఇసుక తవ్వకాలు వెంటనే చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. గిరిజనులకు పోడు భూమి పట్టాలు అందించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఇవీ చదవండి...తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Intro:Ap_tpt_51_15_elephanth_died_in_forest_avb_ap10105

అనారోగ్యంతో ఆడ ఏనుగు మృతిBody:
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కౌండిన్య అభయారణ్యంలో తమిళ నాడు సరిహద్దుకు 120 మీటర్ల దూరంలో ఆడ ఏనుగు అనారోగ్యంతో మృతి చెందింది. రెండు రోజుల క్రితం ఏనుగు మృతి చెందగా.. ఆదివారం సాయంత్రం పశు కాపరులు ఇచ్చిన సమాచారంతో సోమవారం ఉదయం అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఏనుగు మృతి చెందిన విషయం ధృవీకరించారు. జిల్లా అటవీశాఖాధికారి శ్రీనివాసులు ఏనుగు మృతదేహాన్ని పరిశీలించి గత కొన్ని రోజులుగా తమిళనాడు సరిహద్దులో అనారోగ్యంతో ఉన్న ఏనుగు 2 రోజుల క్రితం ఏపీ సరిహద్దు లోకి వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. తిరుపతి ఎస్వి జూ పార్క్ నుంచి డాక్టర్లు వచ్చి ఏనుగు మృతి పట్ల పూర్తి సమాచారాన్ని ఇస్తారన్నారు. ఈ సంఘటన వద్ద ఆయనతో పాటు పలమనేరు అటవీ శాఖ అధికారి మదన్ మోహన్ బీట్ ఆఫీసర్లు సిబ్బంది ఉన్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.