విజయనగరంలోని మహారాజా(ఎంఆర్) కళాశాలను ప్రైవేటు పరం చేయొద్దని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాన్సాస్ ట్రస్టు యాజమాన్యం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి. ఆదివారం కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను మాన్సాస్ ట్రస్టు వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఎంతో మంది మహోన్నతమైన వ్యక్తులు చదువుకున్న... ఈ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకర రావు సూచించారు. మాన్సాస్ ట్రస్టు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలు నాశమవుతాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు హర్ష మండిపడ్డారు.
ఇదీ చదవండి
మాన్సాస్ ట్రస్టులో మరో వివాదం... ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణకు యత్నం