విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి బీచ్ లో గల్లంతైన నిఖిల్ అనే యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ -మెంటాడ పరిధి సముద్ర తీరంలో లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు.
గత నెల 31న చింతపల్లి తీరంలో స్నానం చేసేందుకు జెట్టీ పైనుంచి సముద్రంలోకి దూకి విద్యార్థి నిఖిల్ గల్లంతయ్యాడు. అప్పటి నుంచి వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి రణస్థలం మండలం కొవ్వాడ -మెంటాడ పరిధి సముద్ర తీరానికి నిఖిల్ మృతదేహం కొట్టుకొచ్చిందని చింతపల్లి మెరైన్ ఎస్ఐ తారకేశ్వర రావు తెలిపారు.
ఇదీ చదవండి: suicide:విజయనగరం పీటీసీలో ఎస్ఐ భవానీ ఆత్మహత్య