ఒడిశా నుంచి విశాఖపట్నం వెళుతున్న OR10H 2780 నెంబర్ గల కారు బీభత్సం సృష్టించింది. విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం జీగిరం గ్రామం దగ్గర బైక్‌తో పాటు.. స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. డ్రైవర్ కారు ఆపకుండా అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో వాలంటీర్ భాస్కరరావు కాలు విరిగింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అనిషా పరిస్థితి విషమంగా ఉంది. ఆ బాలికను విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: