విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి పాలకొండ వెళ్తున్న బస్సు నుంచి ఆయిల్ ట్యాంక్ విడిపోయి రోడ్డుపై పడింది. కొద్ది దూరం ట్యాంక్ రోడ్డుపై గీసుకుంటూ వెళ్లింది. డ్రైవర్‌తో పాటు అందరూ అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆయిల్ ట్యాంక్ బోల్టులు ఊడిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. డిపో మేనేజర్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ఇవీ చదవండి...విద్యుదాఘాతంతో యువకుడి మృతి