విజయనగరం పాత బస్టాండ్ సమీపంలోని పశ్చిమ బలిజ వీధిలోని ఓ గృహం ఉంది. మొదటి అంతుస్తులో కల్యాణి, రవికుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. కల్యాణికి చిన్నతనం నుంచే మొక్కల పెంపకంపై అమితాసక్తి. ఆ ఆసక్తే.. మిద్దె తోట సాగు చేసే దిశగా నడిపించింది. సొంతిల్లు కావటంతో.. నలువైపులా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.
అన్నింటినీ ఒకేచోట కాకుండా.. మొక్కల రకం, స్వభావం వంటి అంశాల ఆధారంగా వేర్వేరుగా వాటిని కల్యాణి పెంచుతున్నారు. కూరగాయలు, పూల రకాలు మేడపైన, కారిడార్‌లో ఆక్సిజన్ ఎక్కువిచ్చే జాతులు, ఇంటి పక్కన బోన్సాయి, ముందుభాగంలో ఔషధ మొక్కలను పెంచుతున్నారు.
మిద్దె తోట పెంపకానికి తెలిసినవారి వద్ద కొన్ని మొక్కలు సేకరించిన కల్యాణి.. అరుదైన జాతులు నర్సరీలో కొనుగోలు చేశారు. వాటి పెంపకం గురించి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు. వాటికోసం స్వయంగా ఎరువులు తయారు చేసుకుంటున్నారు. ఇంటిని.. ఇలా నందనవనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: