విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఇసుక తరలింపు.. రెండు గ్రామాల ప్రజల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. గోవిందపురం గ్రామానికి చెందిన ఎడ్ల బండ్ల యజమానులు... లంకపాలెం నుంచి కందివలసగదిలోకి ఇసుకను తరలిస్తున్నారు. దీనిపై లంకపాలెం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బోర్లు ఎండిపోతున్నాయని.. తమ ఊరి నుంచి ఇసుక తరలించొద్దని హెచ్చరించారు. ఈ విషయంపై కొద్దిరోజులుగా రెండు గ్రామాల మధ్య వివాదం జరుగుతోంది. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య కొలిక్కి రాలేదు.
దీంతో సోమవారం రెండు గ్రామాల ప్రజలు.. ఎడ్ల బండ్లను మార్గ మధ్యలో నిలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. అనుమతులులేకుండా ఇసుక తరలించొద్దని అధికారులు చెబుతున్నా .. ఒక వర్గానికి చెందిన వారు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఎడ్లబండ్లను మళ్లీ మార్గం మధ్యలో పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. ఫలితంగా ఈ గ్రామాల మీదుగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొన్ని పాఠశాలకు సెలవు ప్రకటించడం గమనార్హం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా.. ఆ రెండు గ్రామాల ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఎప్పుడు ఎం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: MRO fire on SI : 'ఎందుకీ ఉద్యోగం.. యూనిఫాం తీసేసి గేదెలు కాచుకో'