ప్రస్తుత పరిస్థితుల్లో... ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువ, విద్యార్థులు తక్కువ ఉంటడం చాలా సందర్భాల్లో చూశాం. కానీ విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టి బాలికల ఆశ్రమ పాఠశాల పరిస్థితి భిన్నంగా ఉంది. 189 మంది విద్యార్థునులుండగా... ఒకేఒక్క ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. ఫలితంగా చిన్నారులను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.
అటు పాఠాలు చెప్పలేక ఉపాధ్యాయుడు... ఇటు చెప్పేవారు లేక విద్యార్థునులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది లేకపోవడం కారణంగా... పాఠశాలలో ప్రవేశాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సాలూరు పరిధిలోని చాలా గ్రామాల్లో పిల్లలు లేక స్కూళ్లు మూసివేసే పరిస్థితి ఉంది. అక్కడి ఉపాధ్యాయులను తమ పాఠశాలకు పంపాలని ఆశ్రమ పాఠశాల విద్యార్థునులు కోరుతున్నారు..
ఇదీ చదవండీ... వివేకా హత్యకేసు... మరో మలుపు..!