అనంతపురం జిల్లా రాయదుర్గంలో... తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి షబ్బీర్, తన అనుచరులతో కలిసి.. వైకాపా గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పారు.
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై వైకాపాలో చేరుతున్నట్లు నాయకులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి , పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: