తెదేపా హయాంలో మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని విజయనగరం జిల్లా చీపురుపల్లి తెదేపా అధ్యక్షుడు రౌతు కామునాయుడు డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ది దారులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీడీవోలకు తెదేపా మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు వినతి పత్రాలను సమర్పించారు.
ఇవీ చూడండి...: కరోనాపై ప్రచార రథాలతో అవగాహన.. వాహనాలు ప్రారంభించిన ఎస్పీ