ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే 108 అంబులెన్సుల విషయంలోనూ వైకాపా ప్రభుత్వం రూ.307 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని తెదేపా నేత మహంతి చిన్నంనాయుడు ఆరోపించారు. గడువు పూర్తి కాకముందే అరబిందో సంస్థకు కాంట్రాక్టు అప్పగించడంలో పరమార్థం ఏంటని ప్రశ్నించారు.
తాజా కాంట్రాక్టును ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి కట్టబెట్టారన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిని అరెస్టు చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవాని తోటలో తెదేపా నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారాయణస్వామినాయుడు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నటన నుంచి రాజకీయ నాయకుడిగా 'వారాలబ్బాయ్'