ETV Bharat / state

TDP leader Anitha fires on YSRCP: ప్రభుత్వం అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసింది: వంగలపూడి అనిత

TDP leader Anitha fires on YSRCP: వైకాపా ప్రభుత్వం.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసిందని.. తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. రామతీర్థంలో రాములవారి ఆలయ శంకుస్థాపన సమయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని, పైగా ఛైర్మన్ అశోక్ గజపతిని అవమానించిందని ఆరోపణలు చేశారు.

TDP leader Anitha fires on YSRCP
ప్రభుత్వం అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసింది: వంగలపూడి అనిత
author img

By

Published : Dec 28, 2021, 4:39 PM IST

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత వంగలపూడి అనిత మండిపాటు

TDP leader Anitha fires on YSRCP: వైకాపా ప్రభుత్వం.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసిందని.. తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విజయనగరం జిల్లా కేంద్రానికి వచ్చిన అనిత.. అశోక్ గజపతి రాజుకు సంఘీభావం తెలిపారు. వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. రామతీర్థంలో రాములవారి ఆలయ శంకుస్థాపన సమయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని, పైగా ఛైర్మన్ అశోక్ గజపతిని అవమానించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగితే కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఇదే మాట అడిగితే తిరిగి కేసులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి.. శ్వేత పత్రం విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సినిమా టికెట్లు, మద్యం ధరల పై ఉన్న శ్రద్ధ.. ప్రజలపై కానీ పరిపాలనపై కానీ ఉందా? అంటూ విమర్శించారు.

ఇదీ చదవండి: YS Viveka murder case: శివశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షలు.. సీబీఐ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.