ETV Bharat / state

Chandrababu Vision : పేదల సంక్షేమం, యువత ఉపాధికి ప్రత్యేక విధానాలు : చంద్రబాబునాయుడు

author img

By

Published : May 19, 2023, 2:20 PM IST

Updated : May 19, 2023, 6:33 PM IST

Chandrababu Vision : పేదల సంక్షేమం, పట్టభద్రుల ఉపాధి కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినపుడే ప్రతి కులం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో దాసరి సామాజిక వర్గం, టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

Etv Bharat
Etv Bharat

Chandrababu's visit to Vizianagaram district : పేదల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు అండగా సంక్షేమ పథకాలు రూపొందిస్తామని, పట్టభద్రుల ఉపాధి కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పర్యటించారు. ఈ సందర్భంగా దాసరి సామాజిక వర్గం నాయకులతో చంద్రబాబు సమావేశమై మాట్లాడారు.

సామాజిక బాధ్యత తీసుకోవాలి... సమాజంలో నిరుపేదల అభ్యున్నతిపై పాలకులు, నాయకులు దృష్టి పెట్టాలని, పేదలను ధనికులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినపుడే ప్రతి కులం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యాపరంగా పిల్లలను బాగా చదివించాలని సూచిస్తూ.. పేదలకు అండగా నిలిచేందుకు సామాజిక బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రజల వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి వారి కోసం ఏం చేశామని ఆలోచించాలని పేర్కొన్నారు. పేదలకు అండగా విధానాలు రూపొందిస్తామని చెప్పిన చంద్రబాబు.. మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తామని తెలిపారు. ప్రజాధనం బొక్కకుండా కట్టడి చేసి పేదల సంక్షేమానికి ఖర్చు పెడతామని అన్నారు.

పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నరు... బకాసురుల మాదిరిగా ఇసుక, మద్యం అన్నీ మింగేశారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. పట్టభద్రుల ఉపాధి కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు దసపల్లా భూములు బలవంతంగా రాయించుకున్నారని, తిరుగుబాటు చేస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల ఆగడాల కారణంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు ఆర్థిక కేంద్రంగా విశాఖ మారుతుందని తన హయాంలో లూలూను తీసుకువచ్చినట్లు చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సాయంత్రం అనకాపల్లిలో రోడ్ షో... ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పర్యటించారు. ఈ సందర్భంగా దాసరి సామాజిక వర్గం, టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామానికి శిరికి రిసార్ట్స్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా శిరికి రిసార్ట్స్‌లో గిరిజన వర్సిటీ విద్యార్థులు చంద్రబాబును కలవనున్నారు. తమ సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించనునన్నారు. అనంతరం ఫొటో సెషన్‌లో చంద్రబాబు పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 3 గంటలకు సుంకరమెట్ట కూడలికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు కోర్టు రోడ్ నుంచి నెహ్రూ చౌక్ వరకు చంద్రబాబు రోడ్ షోలో పాల్గొంటారు. 6 గంటలకు నెహ్రూచౌక్ వద్ద నిర్వహించే బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.

Chandrababu Vision : పేదల సంక్షేమం, యువత ఉపాధికి ప్రత్యేక విధానాలు : చంద్రబాబునాయుడు

ఇవీ చదవండి :

Last Updated : May 19, 2023, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.