విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన ఇద్దరు విద్యార్థులు స్నానానికని బోర్ బావి వద్దకు వెళ్లారు. అక్కడ వీరిద్దరికి ఏదో చిన్న తగాదా జరిగి అది కాస్త వివాదంగా మారింది. స్థానికులు, బంధువులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమనిగింది. ఆ తరువాత ప్రాథమిక పాఠశాల వద్ద రాకేష్ చరవాణి చూస్తుండగా... గొడవ పడిన మరో విద్యార్థి వెనకనుంచి వచ్చి రాకేశ్‌పై రాయితో దాడి చేశాడు. తలకు గాయమై రాకేష్ అక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.బాలుని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా అపస్మారక స్థితిలో చికిత్సపొందుతున్న రాకేష్ ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: