విజయనగరం జిల్లాలో ఎన్నికల నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. పార్వతీపురం డివిజన్లో పోలింగ్ నిర్వహణకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌లను కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికోన్నత పాఠశాల వై.టీ.సీ భవనాలతో పాటు ఉద్యాన కళాశాలను చూశారు. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని ఉంచేందుకు అనుకూలతలను, స్ట్రాంగ్ రూమ్ ఓట్ల లెక్కింపు కార్యక్రమాలకు అనువుగా ఉండే గదులను గుర్తించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నిక లు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి...