ETV Bharat / state

ఉరిమితే ఉలికిపాటు.. ఏటా ఎంతోమంది బలి - Vizianagaram district

ఆకాశం ఉరిమిందంటే గుండెలు జల్లుమంటాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడితే ఎక్కడ పిడుగు పడుతుందోనని ఒక్కటే భయం. ఏటా విజయనగరం జిల్లాలో పిడుగులకు ఎంతోమంది బలవుతున్నారు. మూగజీవాలు సైతం చనిపోతున్నాయి. అధికశాతం మంది పశువుల కాపర్లు, పొలాల్లో పని చేసుకునే రైతులు, కూలీలే ఉంటున్నారు.

thunderstorm
thunderstorm
author img

By

Published : May 23, 2021, 5:39 PM IST

ఉరుములు, మెరుపులు, పిడుగుల ప్రభావం వేసవి కాలంలోనే ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతుంటాయి. దీని వల్ల భూతాపం పెరుగుతుంది. ఈ సమయంలో సముద్రం నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే ఆకాశంలో నల్లని దట్టమైన క్యూములోనింబస్‌ మేఘాలు అలుముకుంటాయి. ఈ సందర్భంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఏటా విజయనగరం జిల్లాలో వీటి ధాటికి ఎంతో మంది బలవుతున్నారు.

ముందే మేల్కొంటే..

  • పిడుగుల సమాచారాన్ని వజ్రపాత్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉండే వలయాలను అనుసరించి ఏ ప్రాంతంలో పిడుగు పడుతుంది.. మనం ఎంతవరకు రక్షణ పొందవచ్చో తెలియజేస్తుంది.
  • విపత్తుల శాఖ సైతం వర్షం, పిడుగులు పడే సూచనలను ముందుగానే ప్రజల చరవాణులకు సంక్షిప్త సందేశాల రూపంలో పంపుతుంది. దీంతో పాటు, ముందుగానే అన్ని మండలాల తహసీల్దార్లను అప్రమత్తం చేస్తుంది.
  • పిడుగుపాటుకు గురయ్యే సమయం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా విపత్తుల శాఖ అధికారులు కరపత్రాలు, గోడపత్రికల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.

పరిహారం అందుతుంది.. తెలుసా!
ప్రకృత్తి విపత్తు నష్టం కింద ప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తుంది. కన్ను, కాలు వంటివి కోల్పోతే (తీవ్రత 40-60 శాతం లోపు అయితే) రూ.59,100, తీవ్రత 60 శాతం దాటితే రూ.2 లక్షలు ఇస్తుంది. ఇందుకు వైద్యులు ధ్రువీకరించాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావాలి. పంచనామా, పోస్టుమార్టం ఆధారంగా తహసీల్దారు నివేదిక అందించాలి. జిల్లాలో బాధిత కుటుంబాలకు ఈ పరిహారం సకాలంలో అందడం లేదు. జిల్లాలో 2018 వరకూ చెల్లించారు. ఆ తర్వాత జిల్లా అధికారులు నివేదికలను పంపినప్పటికీ నిధులు విడుదల కావడం లేదు.

అప్రమత్తతే.. మనకు రక్ష

  • గాలులు వీస్తున్నా, ఉరుములు ఉరిమినా పిడుగులు పడే ప్రమాదం ఉందని గుర్తించాలి. ఆ సమయంలో దగ్గరలోని పెద్ద భవనాల్లోకి వెళ్లడం ఉత్తమం.
  • ఉరుములు, మెరుపులు, గాలివాన సమయంలో ద్విచక్ర వాహనాలు నడపరాదు. లోహపు వస్తువులను తాకరాదు.
  • బహిరంగ ప్రదేశాల్లో చరవాణులు వాడరాదు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండకూడదు.
  • ఇళ్లలో ఉన్నవారు తలుపులు, కిటికీలు మూసివేయాలి. ఇంట్లో విద్యుత్తుతో నడిచే అన్ని వస్తువులకూ సరఫరాను నిలిపివేయాలి.
  • ఖాళీగా ఉన్న విశాల మైదానంలో ఉంటే.. చెవులు మూసుకుని, మోకాళ్లలో తలపెట్టుకుని నేల మీద కూర్చోవాలి.

బయట ఉండరాదు
అప్రమత్తతే శ్రీరామరక్ష. ఉరుములు, మెరుపులు, పిడుగుల సమయంలో సాధ్యమైనంత వరకు బయట ఉండరాదు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు, రైతు కూలీలు జాగ్రత్తగా ఉండాలి. మేము వర్షం, పిడుగులు సమాచారాన్ని సంక్షిప్త సందేశం రూపంలో ముందుగా చరవాణులకు పంపుతున్నాం. - బి.పద్మావతి, జిల్లా ప్రబంధకురాలు, విపత్తుల నివారణ సంస్థ

ఇదీ చదవండి..అనుమతి రాగానే ఆనందయ్య ఔషధ తయారీ ప్రక్రియ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.