విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పురపాలక ఎన్నికల కోసం మొత్తం 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. స్థానిక 4వ వార్డు హరిజన పేట పరిధిలోని కాలనీలో కేవలం ఏడుగురు ఓటర్లు మాత్రమే ఉండగా.. వారి కోసం ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల పర్యవేక్షణకు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ఇది సమస్యాత్మక కేంద్రం కావటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఇదీ చదవండి