ETV Bharat / state

విజయనగరంలో లాక్​డౌన్​ను పరిశీలించిన ఎస్పీ

విజయనగరం జిల్లాలో లాక్​డౌన్ నిబంధనల అమలుతీరును ఎస్పీ పరిశీలించారు. పొరుగునే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున ఎస్పీ పర్యటించారు. జిల్లా సరిహద్దుల్లో లాక్​డౌన్ నిబంధనను మరింత కఠినం చేశామని తెలిపారు.

SP  examined the lockdown in Vijayanagaram district
విజయనగరంలో లాక్​డౌన్​ను పరిశీలించిన ఎస్పీ
author img

By

Published : Apr 29, 2020, 4:54 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని విజయనగరం ఎస్పీ రాజకుమారి అన్నారు. విజయనగరంలో అమలవుతున్న లాక్​డౌన్​ను పరిశీలించారు. బందోబస్తు నిర్వహణ, ఏర్పాట్లపై సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా.. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల్లో 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ప్రజల రాకపోకలను నియంత్రిస్తున్నామని వివరించారు. అనుమతి పత్రాలు, గుర్తింపు కార్డులు ఉంటేనే జిల్లాలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.

ఇదీచదవండి.

ఇంట్లో ఉండమన్నందుకు దాడి... వాలంటీర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.