లాక్డౌన్ కారణంగా 65 రోజులుగా ఉపాధి లేక రోడ్డున పడ్డామని తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు, బిర్యానీ, చాట్, నూడిల్స్ అమ్ముకునే నిరుపేదలు రోడ్డున పడ్డారని సీపీఎం నాయకులు రెడ్డి శంకర్రావు అన్నారు. విజయనగరంలో కార్మికులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో పదివేల రూపాయలు వేయాలని డిమాండ్ చేశారు. పరిమిత సమయంలో వీరు వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇది చదవండి : అమ్మ తనం... కంటనీరు పెట్టించింది