విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్. నరసింహమూర్తి అనే ఎస్సై.. ఏసీబీ వలకు చిక్కాడు. కొత్తవలస మండలంలోని పాత సుంకరపాలేనికి చెందిన బి.వి. రాము అనే వ్యక్తికి.. స్టేషన్ బెయిలు మంజూరు చేసేందుకు ఆ ఎస్సై రూ. 30,000 లంచం డిమాండ్ చేశాడు.
మెుదటి విడతగా రూ. 15 వేలు తీసులుకున్న పోలీసు.. రెండో విడతగా మిగిలిన రూ. 15 వేల లంచం సొమ్మును తన నివాసంలో బాధితుడి నుంచి తీసుకుంటుండగా విజయనగరం ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా అవినీతి అధికారిని పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: