కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో గ్రీన్‌జోన్‌లో ఉన్న విజయనగరం జిల్లాలోనే ఆర్టీసీ బస్సులు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పలు నిబంధనలు అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
బస్సుల్లో సగం మందే.. మాస్కు తప్పనిసరి
* విజయనగరం జిల్లా అంతటా కొన్ని బస్సులు నడుపుతారు. రెడ్‌జోన్‌లో ఉన్న విశాఖ, ఆరెంజ్ జోన్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలకూ బస్సులు వెళ్లవు. విజయనగరం- విశాఖ మధ్య నిత్యం 150 వరకు సర్వీసులు తిరిగేవి. ఇప్పుడవి తిరగవు.
* పాసింజర్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడపనుండగా, వీటి సీట్ల సామర్థ్యంలో సగం మందినే అనుమతిస్తారు. ఒక బస్సు వెడల్పు రెండు మీటర్లు ఉంటుంది. అందుకే ఒక వరుసలో చెరో కిటికీవైపు తలొకరు, మధ్యలో ఒకరు కూర్చోవచ్చు.
* ప్రస్తుతానికి కండక్టర్ లేకుండా డ్రైవర్లతోనే బస్సులు నడుస్తాయి. కండక్టర్ ప్రయాణికుల మధ్య తిరుగుతూ టికెట్లు ఇస్తే వైరస్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
* బస్టాండ్లు, ముఖ్యమైన పాయింట్లలో ఆర్టీసీ సిబ్బంది ఉండి టికెట్లు విక్రయిస్తారు. ప్రయాణికులు వాటిని కొని బస్సు ఎక్కాలి.
* మాస్కు లేనివారిని బస్సులోకి అనుమతించరు.
ఇవీ చదవండి...కరోనా కాలంలో.. ఆమె సేవలు అసాధారణం