త్వరలో జరగబోయే పుర ఎన్నికల్లో వైకాపా, తెదేపా ఎన్నికల అజెండాను ప్రకటించాలని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షులు భీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ గురజాడ పబ్లిక్ స్కూల్లో జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో భీశెట్టి బాబ్జి అధ్యక్షతన వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్, మున్సిపల్, ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ప్రత్యేక విధానం లేకుండా జరుగుతున్న ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు బాబ్జి తెలిపారు. ఎన్నికలు ప్రజల కోసమేనని, నాయకుల కోసం పార్టీల కోసం కాదన్న ఆయన.. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...