విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఈనెల 10న బంగారు దుకాణం వద్ద జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మెంటాడ వీధిలో నివాసముంటున్న కోట సత్యవతి ఉపాధ్యాయురాలిగా పని చేసి 10 ఏళ్ల కిందట పదవీ విరమణ పొందారు. ఆమె తన మనవడి బారసాల కోసం బంగారు గొలుసును కొనుగోలు చేసేందుకు ఓ బంగారు దుకాణం వద్దకు వెళ్లారు. ఆమె వద్దనున్న రెండు పాత గొలుసులను తూకం వేయించి... షాప్ నుంచి బయటికి వచ్చేసరికి ఆమె పర్సు కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బంగారం దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి పర్సును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: