స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు విజయనగరం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన చర్యలను అధికారులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 34 జడ్పీటీసీ, 549 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నామినేన్ల స్వీకరణ నుంచి లెక్కింపు, ఫలితాల వెల్లడి వరకూ ప్రతి ఘట్టంలోనూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ప్రధానంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, రవాణా, విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
సహాయ కేంద్రాల ఏర్పాటు...
ఇవాళ్టి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావటంతో... అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ, పోటీచేసే అభ్యర్ధులకు సమాచారం, సహకారం అందించేందుకు సహాయ కేంద్రాలు నెలకొల్పారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. హరి జవహర్‌లాల్ తెలిపారు.
ఇవీ చదవండి: