ETV Bharat / state

పోలీసుల అమ్ముల పొదిలో మరో అస్త్రం

ఈ కెమెరాకు ఒళ్లంతా కళ్లే. ఏ తప్పు చేసినా దొరికిపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీనికి చిక్కితే కష్టాలేే. పోలీసుల అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. అదే బాడీ వార్న్‌(బీడబ్ల్యూఎస్‌). అభివృద్ధి చెందిన జిల్లాల్లో దీని వాడకం ప్రారంభమైనా మన దగ్గరకు మాత్రం ఇటీవలే వచ్చింది.

పోలీసుల అమ్ముల పొదిలో మరో అస్త్రం
పోలీసుల అమ్ముల పొదిలో మరో అస్త్రం
author img

By

Published : Feb 1, 2021, 8:09 PM IST

బాడీ వార్న్‌ వీడియో పరికరాన్ని ఇంతకు ముందు నుంచీ వాడుతున్నా ఎన్నికల నేపథ్యంలో ఇంకా విస్తృతంగా వినియోగిస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయే దీన్ని ఛాతీ, శిరస్త్రాణం, కళ్లద్దాల్లో కూడా ఏర్పాటు చేసి వినియోగించే వీలుంది. ప్రస్తుతం మన వద్ద ఛాతీ వద్ద ఏర్పాటు చేసుకునే పరికరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది వీడియో కెమెరా మాదిరి ఏకకాలంలో వీడియో, ఫొటో చిత్రీకరణతో పాటు శబ్దాలను నమోదు చేస్తుంది.

జిల్లాకు 48:

ప్రస్తుతం జిల్లా అంతటికి 48 కెమెరాలు వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. నియోజకవర్గ పర్యవేక్షకులైన డీఎస్పీ దగ్గర ఒకటి, బలగాల దగ్గర ఒకటి ఉంటాయి. రద్ధీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల దగ్గర వీటితో నిఘా వేయనున్నారు. వీటి వాడకంపై ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి

జిల్లా కేంద్రానికి అనుసంధానం:

ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయడం వలన ఎక్కడ ఏం జరుగుతుంతో జిల్లా పోలీసు కార్యాలయం నుంచే చూడొచ్ఛు రాష్ట్ర పోలీసు కేంద్రంలోనూ ఈ సౌకర్యం ఉండటంతో పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్ఛు

పాత నేరగాళ్లూ జాగ్రత్త:

ఈ పరికరానికి ఉన్న మరో ఘనత ముఖాన్ని గుర్తించడం(పేస్‌ రికగ్నైజేషన్‌) జిల్లాలోని పాత నేరస్థులు, రౌడీ షీటర్లు ఫోటోలు స్కాన్‌ చేసి ఇందులో పొందుపరిస్తే చాటు. ఆ వ్యక్తి ఎక్కడ తారసపడినా ఇది పోలీసుల్ని అప్రమత్తం చేస్తుంది.

ప్రత్యేకతలు ఎన్నో:

రెండు మెగా పిక్సెల్స్‌ రెజల్యూషన్‌ ● 120 డిగ్రీల కోణంలో వీడియో చిత్రీకరణ ● వీడియోలు, ఫోటోల చిత్రీకరణ, వాయిస్‌ రికార్డింగ్‌ సౌకర్యం ● 32 జీబీ అంతర్గత మెమొరీ, మెమురీ కార్డుతో 128 జీబీ వరకు పెంచే సౌలభ్యం● మెమురీ కార్డు లేకుండా 48 గంటలు అదనపు కార్డుతో ఏడు రోజులు ఏకబిగిన రికార్డింగ్‌ ● కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే నియంత్రణ

పోలీసుల అమ్ముల పొదిలో మరో అస్త్రం
పోలీసుల అమ్ముల పొదిలో మరో అస్త్రం

ఇవీ చదవండి

పెళ్లికి పావుతులం బంగారం.. సంక్రాంతికి రూ. 500

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.