విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మద్యం, ఖైనీ, గుట్కా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సాలూరు పట్టణంలో పేకాట స్థావరాలు నడుస్తున్న సమాచారంతో పాటు... మద్యం, ఖైనీ, గుట్కాలు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు... పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు వారి సిబ్బందితో దాడులు చేశారు. పేకాడుతున్న వారిని పట్టుకుని 14 వేల 250 రూపాయలు, ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు చేసి ఖరీదైన మద్యం సీసాలు పట్టుకున్నారు. నిందితులందరిపై కేసులు వేశారు.
ఇదీ చూడండి: