విజయనగరంలో పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల ముగింపులో భాగంగా యూనిటీ రన్ నిర్వహించారు. పట్టణంలోని ఆర్.టి.సి కాంప్లెక్స్ నుంచి కోట జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. విధి నిర్వహణలో పోలీసులు చేసిన త్యాగాలను, నిర్వహించే కఠినమైన విధులను ప్రజలకు ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.
జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ముద్దాడ గాంధీ, చిట్టిపంతుల చిరంజీవరావు, షేక్ ఇస్మాయిల్, బి. శ్రీరాములు, ఎస్ సూర్యనారాయణలను కొల్పోయాం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అంతర్గత భద్రతకు పోలీసుశాఖ శక్తి వంచన లేకుండా పని చేస్తోందని చెప్పారు.
అటువంటి అమర పోలీసు వీరుల త్యాగాలు వృథా కారాదన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించామని తెలిపారు. ఓపెన్ హౌస్ నిర్వహించడం ద్వారా పోలీసు శాఖ నిర్వహించే విధుల గురించి, వినియోగిస్తున్న సాంకేతికత గురించి వివరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, వివిధ రంగాలకు చెందినవారు పాల్గొని పోలీసు శాఖ గొప్పతనం, ఔన్నత్యం గురించి తెలుసుకున్నారని అన్నారు.
అదనపు ఎస్పీ వి. సత్యన్నారాయణరావు, విజయనగరం డిఎస్పీ పి. వీరాంజనేయ రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్పీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ బి. మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, పలువురు సిఐలు, ఇతర పోలీసు అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: