ఏపీకి ఇచ్చిన నిధులపై చంద్రబాబు చర్చకు సిద్ధమా: పియూష్ గోయల్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో భాజపా నిర్వహించిన మేధావుల సమావేశానికికేంద్రమంత్రి పియూష్ గోయల్ హాజరయ్యారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమల్లోకి తెచ్చినసంక్షేమ పథకాలు వివరించారు. అవినీతి, ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు వివరాలు సైతం ఇవ్వకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులపై చంద్రబాబు తనతో చర్చకు సిద్ధమా... అని పీయూష్ సవాలు విసిరారు. రాష్ట్రంలోఅసలైన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు రకాల పథకాల వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాల్ని ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి....
పవన్.. కుల రాజకీయాలు చేస్తున్నారు: జీవీఎల్