మహిళ దినోత్సవం సందర్భంగా...విజయనగరంలో పింక్థాన్ పరుగు - Vijayanagaram District SP Rajakumari
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయనగరంలో మూడు కిలోమీటర్ల పింక్థాన్ పరుగును జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళ క్రీడాకారులు, మహిళ పోలీసులు, ప్రముఖులు పాల్గొన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీలేదని...ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.