లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గరివిడిలో ఆయుర్వేద న్యూరో వైద్య చికిత్స శిబిరం నిర్వహించారు. రాజస్థాన్లోని ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు మనోజ్ శర్మ, ఆయన బృందం.. చికిత్స అందిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఉన్నత స్థాయి వైద్యం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 40 మంది వైద్య బృందం ఆధ్వర్యంలో రోజుకు సుమారు 300 మందిని పరీక్షిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 23 నుంచి జరగుతున్న ఈ శిబిరం నేటితో ముగుస్తుందని తెలిపారు.
పుట్టుకతోనే చూపు, మాట లేకపోవడం.. వినికిడి సమస్యలు ఉన్న వారితో పాటు.. వృద్ధులకూ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గరివిడి నుంచే కాకుండా హైదరాబాద్, దిల్లీ నుంచీ వైద్యం నిమిత్తం రోగులు వస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని మరింతమంది ఉపయోగించుకోవాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోరారు.
ఇవీ చదవండి