ETV Bharat / state

భార్యకు బహుమతి ఇవ్వకముందే మృత్యువు మింగేసింది..? - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వార్తలు

మరో నెలలో రానున్న దసరా ఉత్సవాలకు.. భార్యకు కొత్త గృహాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్న ఆ ఇంటి యజమాని ఆశలపై విధి కన్నెర్ర జేసింది. కొత్తింటి పనులు చూసుకుని తిరిగి వస్తున్న తరుణంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో.. కిందపడిన మల్లిక్ సంతోష్ కుమార్ పైనుంచి మరో వాహనం వెళ్లిపోవడం అక్కడికక్కడే మృతి చెందాడు.

person-dead-in-road-accident
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంతోష్ కుమార్
author img

By

Published : Sep 21, 2020, 3:06 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన మల్లిక్ సంతోష్ కుమార్​కు నాలుగేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన రీతూతో వివాహమైంది. ఏడాదిన్నర క్రితమే దివీస్ కంపెనీలో సివిల్ మేనేజర్​గా ఉద్యోగంలో చేరాడు. దీంతో విశాఖ జిల్లా తగరపువలస ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సొంతింటి కల నిజం చేసుకోవాలని ఊరిలో గృహ నిర్మాణం చేపట్టాడు. దసరా ఉత్సవాల తర్వాత భార్యకు నూతన గృహం ఇవ్వాలని ఎంతో ఆశతో దగ్గరుండి మరీ పనులు చూసుకుంటున్నాడు.

ప్రతి ఆదివారం ద్విచక్రవాహనంపై పర్లాకిమిడి వెళ్లి ఎప్పటిలాగే కొత్త ఇంటి పనులు పరిశీలించి తిరిగి బయలుదేరిన సంతోష్ కుమార్​ను ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఆయన పైనుంచి వెళ్లిపోవడంతో సంతోష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఎస్ఐ మహేష్ ఘటనా స్థలానికి పరిశీలించి, మృతుడి వద్ద ఆధారాలతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇవీ చూడండి...

మహాకవి గురజాడ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.