విజయనగరం జిల్లా బైరిపురంలో గాంధీ విగ్రహ దిమ్మెకు వైకాపా రంగులు వేయడాన్ని... జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. "వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ ?" అంటూ ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలోనే ఇది జరిగిందంటూ ట్వీట్ చేశారు. గాంధీ విగ్రహ దిమ్మెకు వైకాపా రంగులు వేయడంపై నిరసనలు వెల్లువెత్తటంతో అధికారులు చర్యలు చేపట్టారు. విగ్రహానికి మార్పులు చేశారు. తెలుపు రంగు పులిమి చేసిన తప్పును సరిదిద్దుకున్నారు.
సంబంధిత కథనాలు