మే 4న జరిగే పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవ చాటింపును.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిషనరు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. రైల్వేస్టేషన్ వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకొచ్చే ఈ పవిత్ర కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహించనున్నామన్నారు.
ప్రస్తుత కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ కేవలం వైదిక సిబ్బందితో మాత్రమే ఈ క్రతువు పూర్తి చేస్తామని తెలిపారు. తొలుత చదురుగుడికి.. ఆ తర్వాత కోటకు చేరుకొని చాటింపు నిర్వహిస్తామని వివరించారు.
ఇవీ చూడండి: